Uttarkashi Tunnel Collapse | ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు యుద్ధప్రాతపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఐదు ప్రణాళికలను రూపొందించగా.. వాటికి కార్యరూపంలోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారుల బృందం స్కిలియారాలోనే ఉండి పర్యవేక్షిస్తున్నది. ఉన్నతాధికారులు, నిపుణులు సొరంగంలోకి డ్రిల్ చేసేందుకు ఆదివారం ప్లాట్‌ఫారమ్‌ను సిద్ధం చేసేందుకు స్థల పరిశీలన చేశారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రంజిత్ సిన్హా, పీఎంఓ డిప్యూటీ సెక్రటరీ మంగేష్ గిల్డియాల్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ స్పెషల్ డ్యూటీ అధికారి భాస్కర్‌తో ఉత్తరకాశి డీఎం అభిషేక్ సిర్కియాలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. డ్రిల్లింగ్ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడకుండా కాపాడేందుకు కాంక్రీట్ బ్లాక్స్‌ను కప్పుతున్నారు. ఈ కాంక్రీట్ బ్లాకులను బీఆర్ఓ ప్రత్యేకంగా పంపింది. డిల్లింగ్ మిషన్ భద్రతను పటిష్టం చేసిన తర్వాత మళ్లీ పైపులు వేసే పనులు ప్రారంభించనున్నట్లు ఎన్హెచ్ఐడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఆదివారం రాత్రి 10 గంటలకు సిల్కియారా టన్నెల్ ఆగర్ మిషన్ డ్రిల్లింగ్ పనులను పునః ప్రారంభించారు. కొండచరియలు విరిగిపడకుండా కాంక్రీట్ వేశారు. సొరంగంపై డిల్లింగ్ వేసేందుకు తాత్కాలికంగా రహదారి వేస్తుండగా.. పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రధాని సీఎం ధామితో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలపై సమాచారం తీసుకున్నారు. మూతపడిన మూడో రోజైన ఆదివారం రాత్రి మళ్లీ డ్రిల్లింగ్ పనులు ప్రారంభమైనట్లు సహాయ, సహాయ కార్యక్రమాల ఇన్ఛార్జ్ కర్నల్ దీపక్ పాటిల్ తెలిపారు.
అదే సమయంలో, లోపల చిక్కుకున్న కార్మికులకు ఆహారం, ఆక్సిజన్ సరఫరా చేసే పైపులను కాంక్రీట్ హ్యూమ్ పైపులతో కప్పివేశారు. దాంతో కొండచరియలు విరిగిపడినప్పటికీ, ఆహార పదార్థాలు, ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఉండవని అధికారులు పేర్కొన్నారు. టన్నెల్‌కు కుడి, ఎడమ వైపు సమాంతరంగా ఢిల్లింగ్ కోసం జియోఫిజిసిస్ట్లు, జియాలజిస్ట్‌లు సర్వే పూర్తి చేశారు.