డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ కుంభవృష్టి కురిసింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం తడిసి ముద్దయ్యింది. కురిసిన కాసేపైనా కుండపోత వాన పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరదనీరు నిలిచింది. వీధులన్నీ నదులను తలపించాయి. దాంతో అధికారులు లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భారీ ఎత్తున నిలిచిన వరద నీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
Uttarakhand | Dehradun receives heavy rainfall pic.twitter.com/kFD0iDrDAy
— ANI (@ANI) June 2, 2021