లక్నో: భార్య చెల్లెలైన మరదలతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు. చిన్న కూతురు కనిపించకపోవడంతో ఆమె తండ్రి ఆందోళన చెందాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (man elopes with wife’s sister) ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రెండేళ్ల కిందట ఒక కుటుంబానికి చెందిన పెద్ద కుమార్తెను ఒక వ్యక్తి కోర్టులో పెళ్లి చేసుకున్నాడు. అతడు తరచుగా మామ ఇంటికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కుమార్తెతో ఆ వ్యక్తికి చనువు పెరిగింది.
కాగా, మామ పనికి వెళ్లిన సమయంలో ఆ వ్యక్తి ఆ ఇంటికి వెళ్లాడు. భార్య చెల్లెలైన మరదలతో కలిసి పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన మామ తన చిన్న కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. అన్నిచోట్ల వెతికాడు. ఎక్కడా కనిపించలేదు.
మరోవైపు అల్లుడు కూడా మాయమైనట్లు మామ తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన చిన్న కుమార్తెను అతడు తీసుకెళ్లినట్లు అనుమానించాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Nitin Nabin | బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా.. బీహార్ మంత్రి నితిన్ నబిన్
woman marries Krishna idol | కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన మహిళ.. ఎందుకంటే?