Uttar Pradesh : తన భర్తకు ఇతర పురుషులతో వివాహేతర, అసహజ సంబంధాలున్నాయని, అలాగే, అతడు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నడని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మనిపురిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూపాలి అనే మహిళకు, శివమ్ గుప్తా అనే వ్యక్తికి ఫిబ్రవరి, 2024లో మణిపురిలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది.
ఈ వివాహానికి మొత్తం రూ.1 కోటి వరకు ఖర్చైంది. పెళ్లి ఖర్చులతోపాటు కట్నం కింద భర్తకు ఇచ్చిన నగదు, ఆభరణాలు, ఇతర కానుకలు అన్నీ కలిసి రూపాలి కుటుంబం రూ.కోటి ఖర్చు చేసింది. అయినప్పటికీ దీనిపై సంతృప్తి చెందిన శివమ్.. మరో రూ.50 లక్షలు అదనపు కట్నం తేవాలని రూపాలిని వేధించేవాడు. ముంబైలో ఇంజనీర్‌గా పని చేస్తున్న శివమ్ గుప్తాకు నెలకు రూ.2.50 లక్షల వేతనం వస్తోంది. అయితే, అంత కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ, అతడికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగం ఉన్నప్పటికీ రూపాలిని శివమ్ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. కట్నం కోసం వేధించాడు. అంతేకాదు.. ఇంటికి 15 రోజులకు ఒకసారి మాత్రమే వచ్చేవాడు.
ఇదే సమయంలో తన భార్యకు శారీరకంగా దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవాడు. ఈ విషయంలో అతడి ప్రవర్తన వింతగా ఉండేది. దీంతో తన భర్తపై రూపాలికి అనేక అనుమానాలు మొదలయ్యాయి. దీంతో వారు అద్దెకు ఉంటున్న ఇంటిలో ఆమె రహస్య కెమెరాల్ని అమర్చింది. గత ఏడాది జూన్ 21న ఆమెకు ఆ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ద్వారా షాకింగ్ విషయం బయటపడింది. తన భర్త వారి ఇంటిలోకి ఇతర పురుషుల్ని పిలిచేవాడు. వారితో శారీరక సంబంధాలు కలిగి ఉన్నాడని తేలింది. దీంతో ఈ వీడియోలు చూసిన తాను మరింత మానసిక వేదనకు గురైనట్లు పోలీసలుకు ఫిర్యాదులే పేర్కొంది. ఈ విషయంపై ఆమె తన భర్తను ప్రశ్నించింది.
ఈ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేస్తానని చెప్పింది. అయితే, ఈ విషయం ఎవరికైనా చెబితే తనను చంపేస్తానని శివమ్ బెదిరించినట్లు మహిళ పేర్కొంది. దీంతో భయాందోళనకు గురైన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. కానీ, ఆమె పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించడంతో వారి ఆదేశాల మేరకు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.