న్యూఢిల్లీ, జనవరి 8: ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల్లో భాగంగా మొదటి విడుత ఎన్నికల విధులకు గాను 500 కంపెనీల సీఏపీఎఫ్ సిబ్బందిని ఆయా రాష్ర్టాలకు తరలించనున్నారు. ఇందులో 375 కంపెనీల బలగాలను ఉత్తరప్రదేశ్‌కే కేటాయించినట్టు అధికారులు తెలిపారు. తర్వాత దశల కోసం మరో 150 కంపెనీల బలగాలను కేటాయించనున్నట్టు వివరించారు. మొత్తంగా 65వేల మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.