Yogi Adityanath | రోడ్లపై నమాజ్ వద్దు.. ముస్లింలు జనాభాను నియంత్రించుకోవాలి.. యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
Yogi Adityanath : రోడ్లపై నమాజ్ చేసే విషయంలో ముస్లింలకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరిక జారీ చేశారు. యూపీలో ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Yogi Adityanath : రోడ్లపై నమాజ్ చేసే విషయంలో ముస్లింలకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరిక జారీ చేశారు. యూపీలో ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్నోలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్లను బ్లాక్ చేసి, నమాజ్ చేయడం సరికాదని సూచించారు. చట్టం అందరికీ సమానమే అన్నారు.
‘‘అందరూ నన్ను అడుగుతుంటారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రజలు రోడ్లపై నమాజ్ చేయరా అని. అలాంటిది ఇక్కడ ఉండదని చెబుతుంటా. కావాలంటే వెళ్లి చూడమని చెబతా. రోడ్లు ఉన్నవి రవాణా కోసం. ఎవరైనా రోడ్ల మీదకు వచ్చి ట్రాఫిక్ అడ్డుకోవాలని చూశారా..? ఇబ్బంది పెట్టారా..? రోడ్లపై ప్రజలు వెళ్లకుండా అడ్డుకునే హక్కు ఎవరికైనా ఉందా..? కొంతమంతి అడుగుతుంటారు.. తాము ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా నమాజ్ చేయకుండా ఉండటం సాధ్యం కాదు కదా అని. మీ ఇంట్లో అంత స్థలం లేకపోతే.. దానికి అనుగుణంగా జనాభా తగ్గించుకోండి. అనవసరంగా జనాభా పెరగడాన్ని తగ్గించుకోవాలి. ప్రభుత్వ నిబంధన అంటే.. అది చట్టమే. అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. నమాజ్ తప్పనిసరి. కానీ, మీ షిఫ్టుకు అనుగుణంగా చేసుకోండి. మేం ఆపం. కానీ, రోడ్లపై నమాజ్ చేయొద్దు” అంటూ యోగి వ్యాఖ్యానించారు.
नमाज पढ़नी है, आप शिफ्ट में पढ़िए…
प्यार से मानेंगे ठीक है, नहीं मानेंगे तो दूसरा तरीका अपनाएंगे… pic.twitter.com/zDoz6YiqTZ
— Yogi Adityanath (@myogiadityanath) May 18, 2026
ముస్లింలు జనాభాను నియంత్రించుకోవాలని సూచించారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో పర్యటన సందర్భంగా కూడా యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ, వాటిని టీఎంసీ పార్టీ ఖండించింది. ఇక, సీఎం యోగి తాజా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

