UP DGP | యూపీ డీజీపీగా రాజీవ్ కృష్ణ.. నాలుగేళ్ల తర్వాత పర్మినెంట్ డీజీపీ నియామకం
UP DGP : ఉత్తర ప్రదేశ్ నూతన డీజీపీగా రాజీవ్ కృష్ణ నియామకమయ్యారు. నాలుగేళ్ల తర్వాత యూపీకి పర్మినెంట్ డీజీపీ నియామకమవ్వడం విశేషం. 2022 వరకు యూపీలో పర్మినెంట్ డీజీపీనే ఉండేవారు.
UP DGP : ఉత్తర ప్రదేశ్ నూతన డీజీపీగా రాజీవ్ కృష్ణ నియామకమయ్యారు. నాలుగేళ్ల తర్వాత యూపీకి పర్మినెంట్ డీజీపీ నియామకమవ్వడం విశేషం. 2022 వరకు యూపీలో పర్మినెంట్ డీజీపీనే ఉండేవారు. చివరి పూర్తిస్థాయి డీజీపీగా ముకుల్ గోయెల్ ఉండేవారు.
అప్పట్లో ఆయనను ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత నుంచి యూపీలో తాత్కాలిక డీజీపీలనే ప్రభుత్వం నియమిస్తూ వస్తోంది. డీఎస్ చౌహాన్, ఆర్కే విశ్వకర్మ, విజయ్ కుమార్‌లు డీజీపీలుగా పని చేశారు. చివరగా 2025 మే నెలలో ప్రశాంత్ కుమార్‌ను తాత్కాలిక డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు ఆయన స్థానంలో రాజీవ్ కృష్ణ పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగుతారు. ఆయన 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. ఆయన మరో మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 2029 జూన్‌లో రిటైర్ అయ్యే వరకు ఆయనకు పదవీ కాలం ఉంది.
ఇప్పటివరకు రాజీవ్ కృష్ణ విజిలెన్స్ విభాగం డీజీగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన పోలీస్ రిక్రూట్‌మెంట్‌ను పకడ్బందీగా నిర్వహించారు. అలాగే, యాంటీ టెర్రర్ స్క్వాడ్‌కు నేతృత్వం వహించారు. దేశంలోనే అత్యధిక పోలీసులు కలిగిన రాష్ట్రం యూపీనే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dgp
- Rajeev Krishna
- UP
- uttar pradesh
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

