లక్నో: జైలులో ఉన్న ఖైదీ హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపు మెయిల్ పంపాడు. ఆయనను చంపుతానని బెదిరించాడు. పోలీస్ కానిస్టేబుల్ మొబైల్ నుంచి ఈ మెయిల్ పంపాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఖైదీతోపాటు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. (Jail Inmate Threat Mail To Judge) అనుభవ్ మిట్టల్ అనే వ్యక్తి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా సుమారు ఏడు లక్షల మంది పెట్టుబడిదారులను రూ.3,700 కోట్ల మేర మోసగించాడు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే 324 క్రిమినల్ కేసులు అతడిపై నమోదయ్యాయి. 2017లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అనుభవ్ మిట్టల్‌ను అరెస్ట్ చేసింది. సహ నిందితులైన భార్య ఆయూషి, తండ్రి సునీల్ మిట్టల్ కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
కాగా, లక్నో జైలులో ఉన్న అనుభవ్ మిట్టల్, మరో ఖైదీ ఆనందేశ్వర్ అగ్రహారి మధ్య శతృత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తప్పుడు కేసులో అతడ్ని ఇరికేందుకు కుట్ర పన్నాడు. నవంబర్ 4న విచారణ కోసం అనుభవ్‌ను కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్కార్ట్‌గా పోలీస్ కానిస్టేబుల్ అజయ్ కుమార్ ఉన్నాడు.
మరోవైపు తన కేసు స్థితిని తెలుసుకునే నెపంతో ఆ కానిస్టేబుల్ మొబైల్ ఫోన్‌ను అనుభవ్ తీసుకున్నాడు. శతృత్వం ఉన్న తోటి ఖైదీ ఆనందేశ్వర్ పేరుతో నకిలీ ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేశాడు. హత్య చేయబోతున్నట్లు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపు మెయిల్ పంపాడు. మరునాడు ఆ మొయిల్ సెండ్ అయ్యేలా టైమ్ సెట్ చేశాడు.
కాగా, నవంబర్ 5న హైకోర్టు న్యాయమూర్తికి అందిన బెదిరింపు మొయిల్పై పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ అజయ్ కుమార్ మొబైల్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సైబర్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలుసుకున్నారు. ఆ పోలీస్‌ను ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పాడు. ఈ నేపథ్యంలో అనుభవ్ మిట్టల్‌తోపాటు కానిస్టేబుల్ అజయ్ కుమార్‌పై పలు సెక్షన్ల కింద నవంబర్ 7న కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: బెంగళూరు జైలులో ఖైదీల మందు పార్టీలు, చిందులు.. వీడియోలు వైరల్
Watch: కదులుతున్న కారులో నగ్నంగా మహిళ విన్యాసాలు.. వీడియో వైరల్
Parents Kill Daughter | అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. కుమార్తెను చంపిన తల్లిదండ్రులు