Mark Rubio | తాజ్ మహల్ చూసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు : మార్కో రూబియో
మార్కో రూబియో(Mark Rubio) సోమవారం ఆగ్రాలోని చారిత్రిక కట్టడం తాజ్ మహల్‌ను(Taj Mahal) తన భార్య జీనెట్ రూబియోతో కలిసి చారిత్రాత్మక తాజ్ మహల్‌ను సందర్శించారు.
హైదరాబాద్ : భారతదేశ పర్యటనలో భాగంగా మూడో రోజు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో(Mark Rubio) సోమవారం ఆగ్రాలోని చారిత్రిక కట్టడం తాజ్ మహల్‌ను(Taj Mahal) తన భార్య జీనెట్ రూబియోతో కలిసి చారిత్రాత్మక తాజ్ మహల్‌ను సందర్శించారు. ఆ కట్టడాన్ని ప్రపంచ సంపదలలో ఒకటిగా కొనియాడారు. వారు తాజ్ మహల్ వద్ద సుమారు గంటన్నర సేపు గడిపారు. సందర్శకుల పుస్తకంలో “ప్రపంచపు నిజమైన సంపదలలో ఒకటైన తాజ్ మహల్‌ను సందర్శించేందుకు మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు” అని రాశారు.
ఈ పర్యటనలో భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా వారితో పాటు ఉన్నారు. కాగా, ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటైన తాజ్ మహల్ ఇండియాను సందర్శించే ఉన్నత స్థాయి ప్రపంచ నాయకులను, ప్రముఖులను నిత్యం ఆకర్షిస్తూనే ఉంది. గత సంవత్సరం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్, వారి పిల్లలు వివేక్, మిరాబెల్, ఇవాన్లతో కలిసి ఈ కట్టడాన్ని సందర్శించిన విషయం తెసిందే.
కాగా, మే 23 నుంచి మే 26 వరకు జరిగే ఈ పర్యటనలో మార్కో రూబియో భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సహకారం, క్వాడ్ (QUAD) సమావేశాలపై భారత నాయకులతో చర్చలు జరపనున్నారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, రక్షణ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని గతంలోనే ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

