Marco Rubio | ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి మహమ్మద్ షెహబాజ్ షరీఫ్‌తో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ దుశ్చర్యను మార్కో రూబియోకు జైశంకర్ వివరించారు. సరిహద్దుల్లో తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని పాకిస్థాన్ ప్రధానికి ఆయన సూచించారు. ఇరు దేశాల మధ్య చర్చలకు మద్దతిస్తామని ఆయన తెలిపారు.
రూబియోతో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని జైశంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌తో కలిసి పనిచేయడంలో అమెరికా నిబద్ధతను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా పోరాటమే లక్ష్యంగా చేసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచే ఏ ప్రయత్నాన్ని అయినా ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అలాగే యూరోపియన్ యూనియన్(ఈయూ) ఉపాధ్యక్షుడు కజాకల్లాస్, ఇటలీ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి సైతం జైశంకర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ పాకిస్థాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల్ని జైశంకర్ వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు వారికి తెలిపారు. ఉద్రిక్తతలకు పాల్పడితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.
Spoke with US @SecRubio this evening.
Deeply appreciate US commitment to work with India in the fight against terrorism.
Underlined India’s targeted and measured response to cross-border terrorism. Will firmly counter any attempts at escalation.
🇮🇳 🇺🇸
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025