Donald Trump : భారత్-పాకిస్థాన్ (India – Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ట్రూత్ హ్యాండిల్లో సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు తక్షణమే పూర్తిస్థాయిలో కాల్పులను విరమించేందుకు ఒప్పుకున్నాయని ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) తన కథనంలో పేర్కొన్నది.
‘రాత్రంతా భారత్, పాకిస్థాన్ దేశాలతో అమెరికా చర్చలు జరిపింది. రెండు దేశాలు తక్షణమే పూర్తిస్థాయిలో కాల్పులను విరమించేందుకు అంగీకరించాయి. ఈ విషయాన్ని ప్రకటించడం తనకు ఎంతో సంతోషంగా ఉంది. కామన్ సెన్స్‌ను, గొప్ప విజ్ఞతను ఉపయోగించి రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవడాన్ని నేను అభినందిస్తున్నా. ఈ విషయంలో శ్రద్ధ పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు.’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో తెలిపారు.