US Envoy : సుంకాల ఆంక్షల నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)ని కలిశారు. ఢిల్లీలో శనివారం మోడీతో భేటీ అయిన సెర్గో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. రక్షణ, వ్యాపారం, సాంకేతికత, ముఖ్యమైన లవణాలు.. వంటి వాటి గురించి ఇరువురు మంతనాలు జరిపారు. సందర్భంగా తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన ఫొటోను మోడీకి సెర్గో అందజేశారు.
అమెరికా రాయబారిని కలవడం పట్ల మోడీ ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ‘భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌కు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. ఆయన హయాంలో భారత్, అమెరికా బంధం బలోపేతం అవుతుందని, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మెరుగవుతాయని నాకునమ్మకం ఉంది’ అని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.
Glad to receive Mr. Sergio Gor, Ambassador-designate of the US to India. I’m confident that his tenure will further strengthen the India–US Comprehensive Global Strategic Partnership.@SergioGor pic.twitter.com/WSzsPxrJXv
— Narendra Modi (@narendramodi) October 11, 2025
ఇరువురి భేటీ పూర్తయ్యాక సెర్గియో మాట్లాడుతూ.. మోడీని ట్రంప్ మంచి స్నేహితుడిగా భావిస్తాని వెల్లడించాడు. భారత్‌తో సంబంధాలను అమెరికా గౌరవిస్తుందని, సమర్ధులైన ట్రంప్, మోడీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య సఖ్యత కుదురుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు సెర్గియో. ప్రధాని మోడీతో భేటీకి ముందు ఆయన విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలను కలిశారు.ఇక ఆయన బహూకరించిన ఫొటో విషయానికొస్తే.. మోడీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు శ్వేతసౌధంలో దిగిన ఫొటోలో అది. ఆ ఫొటో ఫ్రేమ్‌లో మిస్టర్ ప్రధాన మంత్రి మీరు చాలా గొప్పవారు అని రాసి ట్రంప్ సంతకం చేశారు.
ఈమధ్యే డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై పగబట్టినట్టు సుంకాల మోత మోగించారు. రష్యా నుంచి ముడిచమురు కొంటుందనే అక్కసుతో ట్రంప్ ఏకంగా 50 టారీఫ్‌లు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో.. దిగుమతి వస్తువులపై భారీగా భారం పడుతోంది. మరోవైపు ఇజ్రాయేల్ – హమాస్ దళాల కాల్పుల విరమణలో కీలక పాత్ర పోషించిన ట్రంప్‌ను ప్రధాని మోడీ అభినందించారు.