Bomb Threat | తమిళనాడు రాజధాని చెన్నై (Chennai)లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats In Chennai) వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా యూఎస్ కాన్సులేట్ (US Consulate)తోపాటూ ప్రముఖ నటుడు ప్రభు (actor Prabhu) నివాసానికి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు రెండు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా సోదాలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో దాన్ని నకిలీ బెదిరింపుగా తేల్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, తమిళనాడులోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats In Chennai) వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్, ప్రముఖ నటులు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా (Ilaiyaraaja) స్టూడియోకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు వారాల క్రితం చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి, రెండు రోజుల క్రితం ప్రముఖ నటులు రజినీకాంత్, ధనుష్ నివాసాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అవన్నీ నకిలీ బెదిరింపులుగా అధికారులు తేల్చారు.
Also Read..
Museum | లూవ్రా మ్యూజియంలో ఆభరణాల చోరీ.. ఐదుగురు అనుమానితులు అరెస్ట్
Sabarimala Pilgrimage: శబరిమల అయ్యప్ప దర్శనం.. నవంబర్ 1 నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం
Ayodhya Ram Temple | అయోధ్య రామాలయానికి రూ.3,000 కోట్ల విరాళాలు