Museum | ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ మ్యూజియం (Museum) లూవ్రా (Louvre)లో భారీ చోరీ (robbery) జరిగిన విషయం తెలిసిందే. మ్యూజియంలోని అపోలో గ్యాలరీ (Apollo gallery) నుంచి దాదాపు 102 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలను దొంగలు అపహరించారు. ఈ కేసులో తాజాగా ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ మీడియా నివేదించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో ఈ దోపిడీలో తమ ప్రమేయం ఉందని నిందితులు అంగీకరించినట్లు పారిస్ ప్రాసిక్యూటర్ లారే బెకువా తెలిపారు.
మ్యూజియంలో అరుదైన ఆభరణాల చోరీ
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రసిద్ధి చెందిన లూవ్రా మ్యూజియంలో ఈనెల 19న భారీ చోరీ జరిగింది. మోనాలిసా లాంటి ప్రసిద్ధి చెందిన చారిత్రక కళాఖండాలు ఉన్న ఈ మ్యూజియంలో నెపోలియన్ కాలం నాటి ఆభరణాలను అపహరించారు. స్కూటర్‌పై వచ్చిన చోరులు మోటారు రంపాలను చేతబట్టి నిర్మాణంలో ఉన్న సీస్ ఫేసింగ్ ముఖ ద్వారం ద్వారా ప్రవేశించి అపోలో గ్యాలరీలోని గదిలోకి చేరడానికి హైడ్రాలిక్ లిఫ్ట్‌ను ఉపయోగించారు. అనంతరం అమూల్యమైన ఆభరణాలను అపహరించారని ఫ్రాన్స్ మంత్రి లారెంట్ నూనెజ్ పేర్కొన్నారు. ఇది అతి పెద్ద చోరీగా అభివర్ణించారు. చోరీ సమయంలో అపోలో గ్యాలరీలో ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ ప్రదర్శన జరుగుతుందని వివరించారు. ఈ చోరీ అంతా ఏడు నిమిషాల్లో ముగిసిందన్నారు. నెపోలియన్, సామ్రాజ్ఞిల ఆభరణాల సేకరణ నుంచి తొమ్మిది ఆభరణాలను దొంగలు దోచుకున్నారని తెలిపారు.
Also Read..
Donald Trump | జిన్‌పింగ్‌తో భేటీ అద్భుతంగా జరిగింది.. చైనాపై టారిఫ్‌లను తగ్గిస్తున్నా : ట్రంప్
Donald Trump: అణ్వాయుధాలను పరీక్షించండి.. ట్రంప్ కీలక ఆదేశాలు
Vladimir Putin: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన పోసిడాన్ టార్పిడో పరీక్ష సక్సెస్: పుతిన్