Ola electric scooter | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా కొన్న స్కూటర్ రెండు రోజులకే సమస్య రావడంతో తీవ్ర అసహనానికి గురైన ఓ కస్టమర్ ఏకంగా.. ఓలా షోరూమ్ (showroom)కే నిప్పు పెట్టాడు. ఈ ఘటన కలబురగి (Kalaburagi)లో చోటు చేసుకుంది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ నదీమ్ అనే 26 ఏళ్ల యువకుడు గత నెల 28న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola electric scooter)ను కొనుగోలు చేశాడు. దాని ధర రూ.1.4 లక్షలు. అయితే, స్కూటర్ కొన్న ఒకటి లేదా రెండు రోజులకే అందులో సమస్య తలెత్తింది. బ్యాటరీ, సౌండ్ సిస్టమ్‌లో సమస్య వచ్చింది. రిపేర్ కోసం అతను ఓలా షోరూమ్‌ను సంప్రదించాడు. అయితే, ఎన్నిరోజులైనా వారు స్కూటర్‌ను రిపేర్ చేసి ఇవ్వలేదు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు యువకుడు.. మంగళవారం రాత్రి షోరూమ్ మూసి ఉన్న సమయంలో దానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ, షోరూమ్‌లోని కంప్యూటర్లు, ఆరు స్కూటర్లు, ఇతర సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది. రూ.8.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తన స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు
కర్ణాటక – కలబురగిలో నదీమ్(26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూం స్టాఫ్‌ను సంప్రదించాడు.
ఎన్ని సార్లు… pic.twitter.com/kltLTH73y7
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2024
Also Read..
Vinesh Phogat | జులానా నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన వినేశ్ ఫోగట్
Actor jeeva | హీరో జీవాకు తప్పిన పెను ప్రమాదం
Arvind Kejriwal | కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ సెప్టెంబర్ 25 వరకూ పొడిగింపు