Actor jeeva | తమిళ హీరో జీవా (Actor jeeva)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (car accident) గురైంది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
జీవా తన భార్యతో కలిసి చెన్నై నుంచి చిన్నసేలం వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కన్నియమూర్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అడ్డుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయే క్రమంలో ఆయన కారు బారికేడ్‌ను ఢీ కొట్టినట్లు తమిళ మీడియా పేర్కొంది. అదృష్టవశాత్తూ జీవా, ఆయన భార్య ఇద్దరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ సెప్టెంబర్ 25 వరకూ పొడిగింపు
Sanjauli Mosque | సంజౌలి మసీదు వివాదం.. సిమ్లాలో ఉద్రిక్తత.. లాఠీచార్జ్
Earthquake | పాకిస్థాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఉత్తర భారతం