న్యూఢిల్లీ: నాలుగు నెలల చిన్నారి హత్య కేసులో దోషిగా తేలిన యూపీ మహిళ షాజాదీ ఖాన్(33)కు అబుదాబీలో ఉరిశిక్షను అమలుజేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. యూ ఏఈ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 15న షాజాదీ ఖాన్కు ఉరిశిక్ష విధించినట్టు కోర్టుకు వెల్లడించింది.
ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఫిబ్రవరి 28న యుఏఈలోని భారత ఎంబసీకి చేరిందని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. యూఏఈలో తన కూతురు షాజాదీ ఖాన్ చట్టపరమైన స్థితి తెలియజేయాలంటూ ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఇటీవల ఆశ్రయించారు.