న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఆన్లైన్లో పరిచయమైన మహిళను కలవడం కోసం అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన ఉత్తరప్రదేశ్ యువకుడిని ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్‌లోని పంజాబ్ పోలీసుల కథనం ప్రకారం.. కట్కారి గ్రామస్థుడైన బాదల్ బాబు(30)ను డిసెంబర్ 27న మండి బహాయుద్దీన్ నగరంలో అరెస్ట్ చేశారు.
ఫేస్బుక్లో పరిచయమైన మహిళపై ప్రేమను పెంచుకున్న బాబు ఆమెను వ్యక్తిగతంగా కలవడానికి సరైన వీసా, ప్రయాణ పత్రాలు లేకుండా సరిహద్దు దాటి పాక్‌లోకి ప్రవేశించాడు.దీంతో స్థానిక కోర్టు అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. 2024 జూలైలో ఇదే విధంగా యూపీకి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో పరిచయమైన మహిళను కలిసేందుకు సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. భారత సైనికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.