లక్నో, జనవరి 13: విద్యుత్ పంపణీ సంస్థల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దక్షిణాంచల్ విద్యుత్ వతరణ్ నిగమ్, పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ సంస్థలల్లో భాగస్వామ్యం చేపట్టేందుకు లేదా పూర్తిగా నిర్వహించేందుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఆదివారం టెండర్లను ఆహ్వానించింది.
ఈ రెండు సంస్థలు కలిసి యూపీలోని 21 జిల్లాలకు విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. కాలం చెల్లిన విద్యుత్ సరఫరా వ్యవస్థలు, తరచూ విద్యుత్ కోతల కారణంగా ఈ సంస్థలు నష్టాల్లో ఉన్నందునే ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. కాగా, ఇప్పటికే న్యూఢిల్లీతో పాటు ఒడిశాలో విద్యుత్ సరఫరా రంగంలోకి ప్రైవేటు సంస్థలు ప్రవేశించాయి.