No Helmet No Petrol | రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి (Yogi Adityanath) సర్కార్ ఇటీవలే ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ (No Helmet No Petrol) రూల్‌ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధనను రాష్ట్రంలో అమలు చేస్తోంది. ఈ నిబంధన ప్రకారం.. హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయెద్దంటూ ఫ్యూయల్ యాజమానులకు (Petrol pump owners) ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో బంక్ సిబ్బంది కూడా ఈ రూల్‌ను కచ్చితంగా పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కొత్త రూల్ కారణంగా ఓ పెట్రోల్ బంక్ సిబ్బందికి వింత అనుభవం ఎదురైంది.
విద్యుత్ విభాగంలో లైన్మెన్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పెట్రోల్ కోసం బంక్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అతను హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో అతడికి పెట్రోల్ పోసేందుకు బంక్ సిబ్బంది నిరాకరించారు. శిరస్త్రాణం లేకుంటే పెట్రోల్ పోయొద్దని తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయంటూ చెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు లైన్మెన్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్పైకి ఎక్కి బంక్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం తనకేమీ తెలీనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. అతడు చేసిన పనికి ఒక్కసారిగా షాకైన సిబ్బంది విద్యుత్ అధికారులను సంప్రదించారు. అక్కడికి చేరుకున్న విద్యుత్ అధికారులు 20 నిమిషాల తర్వాత పవర్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ ఘటనపై పెట్రోల్ బంక్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన యూపీలోని హాపూర్ (Hapur) జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
बिना हेलमेट के पेट्रोल नहीं देने पर लाइनमैन ने काट दी बिजली
जिसकी वजह से करीब 20 मिनट तक पेट्रोल पंप पर काम बंद रहा। हालांकि, बाद में लाइन जोड़ दी गई। इस पूरी घटना का CCTV सामने आया है।
📍 हापुड़ जनपद का मामला @ndtvindia pic.twitter.com/tmqOx4y9BV— Adnan ( journalist) (@hapurndtv) January 14, 2025
Also Read..
Arvind Kejriwal | న్యూ ఢిల్లీ స్థానానికి నామినేషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్
Jallikattu | మధురై జిల్లాలో రెండోరోజు సంప్రదాయ జల్లికట్టు క్రీడ.. పోటీపడ్డ యువకులు
Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను తీవ్రంగా తప్పుపట్టిన రాహుల్ గాంధీ