Jallikattu | తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు (Jallikattu) క్రీడలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. పొంగల్ పండుగ సందర్భంగా ఏటా జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు. పరుగెత్తే పశువులను (Bulls) పట్టుకుని నిలువరించేందుకు యువకులు ప్రయత్నిస్తారు. అలాగే గ్రౌండ్లో ఎద్దులను లొంగదీసుకుని వాటిపై ఆధిపత్యం చెలాయించేందుకు పోటీపడతారు.
VIDEO | Tiruchirapalli: Visuals of Jallikattu competition being held in Suriyur, Trichy district, with 775 bulls participating.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/OJjhM7QBk4
— Press Trust of India (@PTI_News) January 15, 2025
పొంగల్ సందర్భంగా ఈ ఉత్సవాలు మధురై (Madurai) జిల్లాలో నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. జిల్లాలోని అలంగనల్లూరు (Alanganallur), పాలమేడు (Palamedu), అవనియాపురం (Avaniyapuram)లో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. రెండో రోజైన బుధవారం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గ్రౌండ్లో ఎద్దులను లొంగదీసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దుకు రూ.11 లక్షల విలువైన ట్రాక్టర్‌ను నిర్వాహకులు అందించనున్నారు. అదేవిధంగా ఉత్సవాల్లో గెలుపొందిన యువకులకు రూ.8 లక్షల విలువైన కారుతోపాటు ఇతర బహుమతులు అందజేస్తారు. తొలిరోజైన మంగళవారం అవనియాపురం జల్లికట్టు ఈవెంట్లో ఒకరు మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ సంగీత తెలిపారు. దాదాపు 75 మంది గాయపడినట్లు వెల్లడించారు.
Also Read..
Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను తీవ్రంగా తప్పుపట్టిన రాహుల్ గాంధీ
Accident | పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. అంతెత్తు ఎగిరిపడిన యువకుడు.. వీడియో
IIT Baba: మహాకుంభ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ఐఐటీ బాబా