Mayawati : విపక్ష ఇండియా కూటమి తలుపులు బీఎస్పీ కోసం తెరిచే ఉంటాయని రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్య పోరాటానికి కలిసి రావాలా వద్దా అనేది మాయవతే నిర్ణయించుకోవాలని యూపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ అవినాష్ పాండే స్పష్టం చేశారు.
ఇండియా కూటమి బీఎస్పీ తమ భాగస్వామ్యం పక్షంగా ఉండాలని కోరుకుంటోందని అయితే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మాయావతి ఇప్పటికే ప్రకటించిందని అన్నారు.
ఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ త్వరలో ఖరారవుతుందనే విశ్వాసం ఉందని పాండే పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, ఎస్పీ కొన్ని చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని వెల్లడించారు.
Read More :