UP temple | ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ (Barabanki) జిల్లాలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హైదర్ఘర్లో ఉన్న అవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో (Awsaneshwar Temple) స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యూపీ సీఎం (UP CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా (ex gratia) ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అంతేకాదు గాయపడిన వారికి తక్షణ సాయం అందించాలని, సరైన వైద్యం అందించాలని యూపీ సీఎం అధికారులను ఆదేశించారు.
Barabanki electrocution incident | UP CM Yogi Adityanath announces an ex gratia of Rs 5 lakhs for the bereaved families: CMO
So far, two people have lost their lives in the electrocution incident at the Awsaneshwar Temple, Barabanki, which took place earlier today at 2 am https://t.co/XvGDp9cWA0
— ANI (@ANI) July 28, 2025
ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. శ్రావణ మాసంలో మూడో సోమవారం కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహాదేవుడికి జలాభిషేకం చేయడానికి తమ వంతుకోసం వేచిఉన్నారు. ఈ క్రమంలో కరెంటు వైర్లు తెగిపడంతో పలువురికి విద్యుత్ షాక్ (Electric Shock) తగిలింది. దీంతో భయాందోళనలకు గురైన భక్తులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read..
Haridwar | మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య
Parliament Session | సిందూర్‌పై చర్చ.. మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో మాట్లాడనున్న రాజ్‌నాథ్ సింగ్