Uttar Pradesh | లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ భవనంలోకి బుధవారం వర్షపు నీరు చేరింది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా ఈ పరిస్థితి ఏర్పడటంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. బుధవారం రెండు గంటలపాటు వర్షం కురవడంతో, శాసనసభ భవనంలోని కొన్ని చోట్ల, భవనం వెలుపల నీరు చేరింది. దీంతో సిబ్బంది బకెట్లు, మాప్లతో నీటిని బయటకు పంపించేందుకు శ్రమించారు. రాష్ట్ర శాసనసభకు ఎక్కువ బడ్జెట్ అవసరమంటూ సమాజ్వాదీ పార్టీ నేత, ఎమ్మెల్యే శివపాల్ సింగ్ యాదవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.