e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News క‌రోనా సోకి 577 మంది టీచ‌ర్లు బ‌లి..

క‌రోనా సోకి 577 మంది టీచ‌ర్లు బ‌లి..

క‌రోనా సోకి 577 మంది టీచ‌ర్లు బ‌లి..

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య తాండ‌వం చేస్తోంది. యూపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన్న 577 మంది టీచ‌ర్లు క‌రోనా బారిన ప‌డి చ‌నిపోయారు. ఈ మేర‌కు యూపీ ఎన్నిక‌ల సంఘానికి టీచ‌ర్స్ యూనియ‌న్ ప్ర‌తినిధులు.. టీచ‌ర్ల మ‌ర‌ణాల‌పై నివేదిక స‌మ‌ర్పించారు. మే 2న జ‌ర‌గాల్సిన కౌంటింగ్‌ను వాయిదా వేయాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని టీచ‌ర్లు కోరారు.


ఈ సంద‌ర్భంగా యూపీ శిక్ష‌క్ మ‌హాసంఘ్ ప్రెసిడెంట్ దినేష్ చంద్ర శ‌ర్మ మాట్లాడుతూ.. పంచాయ‌తీ ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో కొంత మందికి క‌రోనా సోకింది. 71 జిల్లాల నుంచి 577 మంది టీచ‌ర్లు క‌రోనా సోకి మ‌ర‌ణించారు అని తెలిపారు. టీచ‌ర్ల మ‌ర‌ణాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అల‌హాబాద్ కోర్టు మంగ‌ళ‌వారం యూపీ ఎన్నిక‌ల సంఘాన్నిఆదేశించింది. ఈ క్ర‌మంలో స్పెష‌ల్ వ‌ర్క్ ఆఫీస‌ర్ ఎస్‌కే సింగ్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, ఎన్నిక‌ల అధికారుల‌కు టీచ‌ర్ల మ‌ర‌ణాల‌పై 24 గంట‌ల్లో నివేదిక ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పుల క‌ల‌క‌లం

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై మంత్రి ఈట‌ల స్ప‌ష్ట‌త‌

కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి ఈట‌ల ఫైర్‌

కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పుల క‌ల‌క‌లం

తెలంగాణలో కొత్తగా 7,994 కరోనా కేసులు

క‌రోనా ఎఫెక్ట్‌.. చార్‌ధామ్ యాత్ర ర‌ద్దు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా సోకి 577 మంది టీచ‌ర్లు బ‌లి..

ట్రెండింగ్‌

Advertisement