కాఠ్మాండు: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan).. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన పశుపతినాథ్‌ను దర్శించుకున్నారు. బిమ్స్టెక్ దేశాలకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రులు కాఠ్మాండులో సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పశుపతినాథుడి దర్శనం చేసుకున్నారు. తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో పశుపతినాథ్ ఆలయ విజిట్‌కు చెందిన వీడియోను పోస్టు చేశాడు.
आज सपरिवार भगवान पशुपतिनाथ के दर्शन से जीवन धन्य हो गया। इस दौरान नेपाल वासियों की आत्मीयता और उत्साह ने हृदय को अभिभूत कर दिया। महादेव की भक्ति में डूबे श्रद्धालुओं से मिलकर नई ऊर्जा मिली।
भगवान पशुपतिनाथ सबका मंगल और कल्याण करें; यही प्रार्थना बारंबार है।
हर हर महादेव 🙏 pic.twitter.com/pMdAlWJnx2
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 10, 2025
ఆలయ ఆవరణలో రుద్రాక్ష, హర్సింగార్ మొక్కలను కేంద్ర మంత్రి నాటారు. కుటుంబంతో కలిసి పశుపతినాథుడికి పూజలు చేశానని, దీన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తన ఎక్స్ అకౌంట్లో చెప్పారు. పశుపతినాథుడి పూజ తనకు కొత్త ఉత్తేజాన్ని, ప్రేరణను ఇస్తుందన్నారు.
भगवान पशुपतिनाथ के पावन प्रांगण में
रुद्राक्ष और हरसिंगार के पौधे रोपने का सौभाग्य मिला।4 वर्ष पूर्व नर्मदा मैया की गोद में रोपे संकल्प का बीज पशुपति महादेव के आंगन तक पहुंच गया है।
मैं तो बस एक निमित्त हूँ,
कर्म का यह मार्ग, शिव की प्रेरणा है।
महादेव की कृपा बनी रहे,
और… pic.twitter.com/LMh28anlLi— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 10, 2025