Kerala Blasts | పినరాయి విజయన్ వర్సెస్ రాజీవ్ చంద్రశేఖర్
కేరళలో వరుస పేలుళ్ల (Kerala Blasts) ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం పినరాయి విజయన్, కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ల మధ్య ఆరోపణులు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది.
తిరువనంతపురం : కేరళలో వరుస పేలుళ్ల (Kerala Blasts) ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం పినరాయి విజయన్, కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ల మధ్య ఆరోపణులు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఎర్నాకుళం జిల్లాలో ఓ ప్రార్ధనా స్ధలంలో మూడు పేలుళ్ల ఘటనపై కేరళ ప్రభుత్వాన్ని విమర్శించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేరళ సీఎం పినరాయి విజయన్ విరుచుకుపడ్డారు. మతపరమైన అజెండాతోనే కేంద్ర మంత్రి వ్యాఖ్యలున్నాయని విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు.
మత అజెండాతో కాషాయ పార్టీ వ్యవహరిస్తోందన్న కేరళ సీఎం వ్యాఖ్యలను రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. పినరాయి విజయన్ అబద్దాల కోరని, ఎస్డీపీఐ, పీఎఫ్ఐ, హమాస్‌తో సంబంధాలు లేకుంటే మతతత్వ ముద్ర వేస్తారా అని నిలదీశారు. బీజేపీలో ఉన్న వారెవరికీ ఎస్డీపీఐ, పీఎఫ్ఐ, హమాస్‌తో లింకులుండవని తాను గర్వంగా చెప్పగలనని అన్నారు.
కేరళలోని మలప్పురంలో సాలిడారిటీ యూత్ మూమెంట్ నిర్వహించిన ర్యాలీలో హమాస్ నేత వర్చువల్‌గా పాల్గొనడాన్ని మంత్రి తప్పు పట్టారు. ఇవాళ పేపర్ చదువుతున్న ప్రతి ఒక్కరికీ పది రోజుల కిందట హమాస్ ఏం చేసిందనేది తెలుసని, వారు బాలికలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడి, ప్రజలకు గుండు కొట్టించారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Girlfriend dharna | నాలుగేళ్లుగా ప్రేమించి మొహం చాటేశాడు.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

