న్యూఢిల్లీ: వ్యాపారులు అత్యవసర ఆహార పదార్థాల నిల్వలు పెంచుకుంటున్నట్టు వార్తలు రావడంతో కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. అత్యవసర ఆహార పదార్థాలను సేకరించి నిల్వలు పెంచుకుంటున్న ట్రేడర్లు, హోల్సేల్ వ్యాపారులు, రిటైలర్లను హెచ్చరించారు.
ప్రభుత్వం వద్ద చాలినన్ని నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎవరైనా వీటిని పెద్ద ఎత్తున సేకరించడం కానీ, నిల్వ చేయడం కానీ చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.