న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో సైంటిస్టులు, ఇంజినీర్ ఏసీజీల రాజీనామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వీరి రాజీనామాలను నియంత్రించేందుకు కేంద్ర అంతరిక్ష శాఖ కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంకోవైపు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కీలక డాటా లీక్ అయిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటిపై కేంద్రమంత్రి జితేంద్రసింగ్ స్పందిస్తూ.. ‘అవన్నీ పరిపాలనా సమస్యల వల్ల వస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా పనిచేయట్లేదు. అందుకే ఇస్రోలో రాజీనామాలు చేస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది వచ్చారు. చాలా మంది వెళ్లిపోయారు. అదేమంత పెద్ద సమస్య కాదు’ అంటూ సమాధానం ఇచ్చారు. ఇస్రో మాజీ చైర్మన్ సోమ్నాథ్ వెళ్లడంపై కూడా స్పందించారు. ‘సోమ్నాథ్ వెళ్లిపోవడం వల్ల ఎలాంటి నష్టాలు రాలేదు. ఆయన లేకపోయినా గగన్యాన్ లాంటి కీలక ప్రాజెక్టులు ఆగవు. రాజీనామాలు కొత్తేం కాదు. వారి స్థానాల్లో కొత్తవారు వస్తారు. డాటా లీక్ పెద్ద విషయం కాదు’ అని చెప్పుకొచ్చారు.