న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకంపై వస్తున్న ఆరోపణల్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. శనివారం నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన తెలివితేటలు, ఆలోచనలు అభివృద్ధి కోసమే తప్ప, స్వలాభం కోసం కాదని స్పష్టం చేశారు. ‘నా మెదడు రూ.200కోట్ల విలువైనది.
నిజాయితీగా ఎలా సంపాదించాలో తెలుసు’ అని అన్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. సోషల్మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారమంతా ‘రాజకీయ ప్రేరేపితం’ అని అన్నారు. ఇథనాల్ కలపటం వెనుక స్వీయ ప్రయోజనాలు, స్వార్థముందన్న ఆరోపణలపై గడ్కరీ పై విధంగా స్పందించారు.