Kishan Reddy | ధీరజ్ సాహు దగ్గర దొరికిన డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలి : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
Kishan Reddy | ధీరజ్ సాహు దగ్గర దొరికిన డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలి : కేంద్రమంత్రి కిషన్రెడ్డి Kishan Reddy | కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు.
Kishan Reddy | కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఆ డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జార్ఖండ్ చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై ఐటీ సోదాల్లో రూ.290కోట్ల అక్రమ సంపాదనను అధికారాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. దేశ చరిత్రలో ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన బయటపడడడం తొలిసారి అన్నారు. ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవశా చేశారు. డబ్బులు లెక్కించే యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయి తప్పితే.. తప్పితే లెక్కించడం పూర్తికావడం లేదన్నారు.
అవినీతి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది..
రాంచీలోని ఎనిమిది బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయని గుర్తించి ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారన్న ఆయన.. కాంగ్రెస్ అవినీతి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన, సన్నిహితమైన అనుచరుడు ధీరజ్ సాహు అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసింది ధీరజ్ సాహునేనన్నారు. కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు జరిగితే రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శిస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కూడబెడుతున్న నోట్ల గుట్టలన్నారు. ఓడిపోయిన వ్యక్తికి మూడుసార్లు కాంగ్రెస్ రాజ్యసభకు పంపిందని గుర్తు చేశారు.
యూపీఏ హయాంలో 12లక్షల కోట్ల అవినీతి
యూపీఏ హయాంలో రూ.12లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. ప్రతి రోజు కాంగ్రెస్ కుంభకోణాలే కనిపించాయన్నారు. 2జీ, కోల్ తదితర అనేక కుంభకోణాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ వ్యక్తులు తీహార్ జైల్లో ఉన్న పరిస్థితి ఉందని, తొమ్మిదిన్నరేళ్లుగా నీతివంతమైన పాలన నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం దేశానికి ఇస్తున్న గ్యారంటీ అన్నారు. రాహుల్ గాంధీకి ధీరజ్ సాహు వంటి అవినీతిపరులు ఎంత మంది సన్నిహితులు ఉన్నారోనన్నారు.
మూడుపువ్వులు.. ఆరుకాయలుగా అవినీతి..
కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట అవినీతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెల్లివిరుస్తోందని ఆరోపించారు. ఐటీ సోదాలు చేయాలో వద్దో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ కుంభకోణాలకు పాల్పడిన ఆమ్ ఆద్మీ, తృణమూల్ పార్టీలు అత్యంత సన్నిహితమైనవన్నారు.
కర్ణాటకకు చెందిన డబ్బు తీసుకువచ్చి కాంగ్రెస్ తెలంగాణలో పంచిందని.. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి, అవినీతికి విడదియలేని బంధం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి దేశ ప్రజలు మూడోసారి పట్టం కడతారని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

