హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ర్టాలకు చెందిన ప్రముఖ నాయకులు చెన్నై వేదికగా సమావేశం అవడాన్ని బీజేపీ రాష్ట్ర నేతలు తప్పుబట్టారు. డీలిమిటేషన్ ఇంకా ప్రారంభమే కాలేదని, దీని గురించి వస్తున్న వార్తలు అపోహలు మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయన్నారు.
‘పిల్ల పుట్టకముందే కుళ్ల కుట్టినట్టు’ ప్రతిపక్షాల తీరు ఉన్నదని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్ని కేంద్రప్రభుత్వం మీదికి ఎగదోసి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. చెన్నైలో జరిగింది ఓ దొంగల ముఠా సమావేశమని మరో కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రిజర్వేషన్లు, డీలిమిటేషన్ పేరిట ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ అన్నారు.