న్యూఢిల్లీ, జనవరి1: 2027, ఆగస్టు 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు వచ్చే ఏడాది ఆగస్టు 15కు పూర్తవుతుందని, దశల వారీగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. తొలుత సూరత్-బిల్మోరా, తర్వాత వాపి-సూరత్, అనంతరం వాపి-అహ్మదాబాద్, థాణె-అహ్మదాబాద్ల మధ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, దీంతో ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పూర్తవుతుందని ఆయన వివరించారు. 508 కి.మీ దూరం ఉన్న ఈ కారిడార్లో గంటకు 320 కి.మీ వేగంతో బుల్లెట్ రైలు ప్రయాణిస్తుందని, ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణ కాలం 2 గంటల 17 నిమిషాలని ఆయన చెప్పారు.