Arjun Munda : గత మూడేండ్లుగా హేమంత్ సోరెన్ సారధ్యంలోని జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసిందని కేంద్ర మంత్రి, జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం చీఫ్ అర్జున్ ముందా ఆరోపించారు. హేమంత్ హయాంలో భూ కుంభకోణాలు, మైనింగ్ స్కామ్‌లు, ప్రైవేట్ లీజులు, ఇతర స్కామ్‌లతో అవినీతి పెచ్చరిల్లిందని అన్నారు.
ప్రజలకు వాస్తవాలు వెల్లడించాల్సింది పోయి వాటిని మరుగునపరిచేందుకు హేమంత్ సోరెన్ ప్రయత్నించారని దుయ్యబట్టారు. అప్పటి తప్పిదాలకు ఇప్పుడు ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారని, ఈ వ్యవహారంపై విచారణ సాగుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధాని మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని, అంతర్జాతీయ స్ధాయిలో భారత్ ప్రతిష్టను, పరపతిని పెంచేందుకు కృషి చేస్తున్నారని అర్జున్ ముందా కితాబిచ్చారు.
కాగా భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్‌కు పలుమార్లు సమన్లు జారీ చేసిన అనంతరం ఆయనను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సోరెన్ సుప్రీంకోర్టును సంప్రదించగా హైకోర్ట్‌లో పిటిష్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం సూచించింది.
Read More :