Union Home Ministry | న్యూఢిల్లీ : భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం హోం శాఖ లేఖలు రాసింది. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 వినియోగించుకోవాలని లేఖలో పేర్కొంది. అయితే రూల్ 11 ప్రకారం సైరన్ వంటి అత్యవసర పరికరాలు కొనేందుకు పూర్తి అధికారం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక అవసరమైతే అత్యవసర అధికారులు ఉపయోగించుకోవాలని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
అయితే భారత్లోని సరిహద్దు నగరాల్లో పాకిస్తాన్ దాడి చేస్తుందనే ముందస్తు సమాచారంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలను అలర్ట్ చేయడానికి సైరన్లను ఉపయోగిస్తుంది భారత సైన్యం. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్గా ఉండి పౌరుల భద్రతకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉండాలని సూచనలు చేసింది కేంద్రం.