రాంచీ, నవంబర్ 3: జార్ఖండ్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలుచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. యూసీసీ నుంచి గిరిజనులకు మినహాయింపు కల్పిస్తామని ఆయన తెలిపారు. రాంచీలో బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో ‘సంకల్ప్ పత్ర’ను అమిత్ షా విడుదల చేశారు. గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా యూసీసీని అమలుజేస్తామని హామీనిచ్చారు.