మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 11:52:42

రాష్ట్రాల‌కు జీఎస్టీ బ‌కాయిలు చెల్లించ‌లేం: కేంద్ర ఆర్థిక‌శాఖ‌

రాష్ట్రాల‌కు జీఎస్టీ బ‌కాయిలు చెల్లించ‌లేం:  కేంద్ర ఆర్థిక‌శాఖ‌

హైద‌రాబాద్‌: రాష్ట్రాల‌కు జీఎస్టీ బ‌కాయిలు చెల్లించే స్థితిలో కేంద్ర ప్ర‌భుత్వం లేద‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి జయ్ భూష‌న్ పాండే తెలిపారు.  ప్ర‌స్తుతం రెవ‌న్యూ షేరింగ్ ఫార్ములా ప్ర‌కారం ఇది వీలు అయ్యే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆదాయం ప‌డిపోయిన కార‌ణంగా రాష్ట్రాల జీఎస్టీ వాటాపై ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. మంగ‌ళ‌వారం జ‌రిగిన పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీలో జీఎస్టీ బ‌కాయిల‌పై ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఆదాయం త‌గ్గిపోతే, అప్పుడు జీఎస్టీ చ‌ట్టం ప్ర‌కారం కొత్త విధానంలో బ‌కాయిలు చెల్లించే అవ‌కాశం ఉంద‌ని అజ‌య్ భూష‌ణ్ పాండే వెల్ల‌డించారు. 2019-20 సంవ‌త్స‌రానికి జీఎస్టీ ప‌రిహారం చివ‌రి ఇన్‌స్టాల్మెంట్ కింద కేంద్ర ప్ర‌భుత్వం 13,806 కోట్లు రిలీజ్ చేసిన‌ట్లు కేంద్ర ఆర్థిక‌శాఖ సోమ‌వారం ప్ర‌క‌టించింది.  వాస్త‌వానికి రాష్ట్రాల వాటా అంశాన్ని తేల్చేందుకు జూలైలో జీఎస్టీ మండ‌లి సమావేశం జ‌ర‌గాల్సి ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ స‌మావేశం ఏర్పాటు కాలేదు.  


logo