ఎంఎస్ఎంఈలకు అంతంత మాత్రమే.. నిరుత్సాహానికి గురిచేసిన బడ్జెట్ : ఏఐఈ
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ‘చాంపియన్'ల్లా వృద్ధి చెందేందుకు రూ.10వేల కోట్లతో నిధిని ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ‘చాంపియన్’ల్లా వృద్ధి చెందేందుకు రూ.10వేల కోట్లతో నిధిని ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశ ఆర్థిక వృద్ధికి ఎంఎస్ఎంఈలను చోదక శక్తులుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.10 వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
ఆర్థిక వృద్ధి దిశగా సాగుతున్న ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’ సరైన దిశలోనే పయనిస్తున్నదని, అది స్థిరంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. సూక్ష్మ పరిశ్రమలకు అత్యవసర పెట్టుబడులు అందుబాటులో ఉంచడానికి ఐదేండ్ల క్రితం నెలకొల్పిన సెల్ఫ్ రిలయెంట్ ఇండియా నిధికి మరో రూ.2,000 కోట్లను జతచేస్తున్నట్టు వెల్లడించారు.
నిర్దిష్ట ప్రకటనలు లేవు
కేంద్ర బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు సంబంధించి నిర్దిష్టమైన ప్రకటనలేవీ లేవని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ (ఏఐఈ) అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎంఎస్ఎంఈలకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఎంఎస్ఎంఈలకు సంబంధించి బడ్జెట్లో ఎంతగానో ఆశించామని, కానీ తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని ఏఐఈ చైర్మన్ కేఈ రఘునాథన్ పేర్కొన్నారు. వివిధ రంగాలకు పలు రకాలుగా కేటాయింపులు, ప్రోత్సాహకాలను ప్రకటించిన మంత్రి ఎంఎస్ఎంఈలను మాత్రం నిరుత్సాహానికి గురిచేశారని ఆయన విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

