న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) ఇవాళ కీలక ప్రకటన చేశారు. నీట్ యూజీ పరీక్షను వచ్చే ఏడాది నుంచి కంప్యూటర ఆధారిత పరీక్షగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. నీట్ రీ ఎగ్జామ్‌కు చెందిన అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ వరకు పంనున్నట్లు చెప్పారు. మే 3వ తేదీన జరిగిన పరీక్షను రద్దు చేసిన నేపథ్యంలో మళ్లీ జూన్ 21వ తేదీన పరీక్షను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓ గెస్ పేపర్ వాట్సాప్‌లో వైరల్ కావడం.. దాంట్లో ఉన్న వంద ప్రశ్నల వరకు రిపీట్ కావడం వల్ల.. కేంద్రం నీట్ పరీక్షను రద్దు చేసింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం జీరో టాలరెన్స్‌తో ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితులను ఎదురుకావడం వల్లే రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల సవాళ్లు అధికం అయ్యాయని, అయినా విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు. మే 3వ తేదీన జరిగిన పరీక్ష లీకైన అంశం గురించి సీబీఐ సమ్రగంగా దర్యాప్తు చేయనున్నట్లు ఆయన చెప్పారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.