న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో రెండు రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 6,881 కోట్ల వ్యయంతో సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్‌కు(12.9 కిలోమీటర్లు), గోవింద్‌ఘాట్ నుంచి హేమ్‌కుండ్ సాహిబ్జీకి(12.4 కిలోమీటర్లు) రెండు రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్‌కు 12.9 కిలోమీటర్ల రోప్‌వే నిర్మాణాన్ని రూ. 4,081కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. రైతులకు జెనెరిక్ పశు ఔషధాల పంపిణీకి రూ. 3,880 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.