Union Budget | కొబ్బరి, జీడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో కొబ్బరి అభివృద్ధి కోసం జాతీయ కొబ్బరి మిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో 30లక్షల మంది కొబ్బరి సాగురంగంపై ఆధారపడి ఉన్నారని అన్నారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కొత్త కొబ్బరి తోటలు, ఉన్నవాటిలో కొత్త మొక్కలు వేసుకునేందుకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
చేపల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 500 కొత్త రిజర్వాయర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మహిళా సాధికారత చర్యల్లో భాగంగా షీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాంచీ, తేజ్‌పూర్‌లో నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పూర్వోదయలో భాగంగా తూర్పు తీరంలో ప్రత్యేక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
పూర్వోదయ రాష్ట్రాలకు 5 విద్యుత్ బస్సులు కేటాయిస్తున్నామని అన్నారు. ఈశాన్య భారతంలో బౌద్ద సర్క్యూట్ల ఏర్పాటుకు ప్రత్యే మిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తేరవాద, మహాయాన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తున్నామని చెప్పారు. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు రూ.లక్షా 4 వేల కోట్ల నిధులు ఇస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా 41 శాతం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. పూర్వోదయలో భాగంగా తూర్పు తీరంలో ప్రత్యేక పారిశ్రామి కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.