ధార్వాడ్ : కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్‌పై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డియాండ్ చేస్తూ మంగళవారం నిరుద్యోగులు పెద్దయెత్తున ఆందోళన నిర్వహించడంతో ధార్వాడ్ నగరం స్తంభించిపోయింది.
వేలాది మంది నిరుద్యోగులు, ముఖ్యంగా వివిధ పోటీ పరీక్షా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న వారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోరుతూ వీధులకెక్కారు. నాలుగు నెలల కాలంలో ఇది వారు చేసిన నాలుగో ఆందోళన.