న్యూఢిల్లీ, ఆగస్టు 16: తమ దేశ జాతీయ పతాకాలను చేతబట్టి సుమారు 13 వేల అడుగుల ఎత్తు నుంచి సైనిక విమానం నుంచి దూకిన 65 మంది స్కైడైవర్లు గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు దక్కించుకున్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. కేరళలోని కన్నూర్‌కు చెందిన జంషీర్ థనలోట్, యూపీ లోని గోరఖ్‌పూర్‌కు చెందిన అభిషేక్ రావత్, బీహార్‌లోని పాట్నాకు చెందిన ఇషారాజ్ ఈ ఘనత సాధించారు.
ఈ నెల 7న లిబియాలో వీరు ఈ సాహసం చేశారు. సుమారు 38 దేశాలకు చెందిన వారు జాతీయ జెండాలతో అంత ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేయడం కొత్త రికార్డు అని నిర్వాహకులు తెలిపారు.