Madrassa | ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసు ఫరీదాబాద్ (Faridabad)లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ (Al Falah University) చుట్టూనే తిరుగుతోంది. దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ ఈ వర్సిటీకి చెందిన వాడే. అంతేకాదు, ఫరీదాబాద్‌లో బయటపడ్డ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ సభ్యులంతా వర్సిటీలో పనిచేస్తున్నవారే. దీంతో దర్యాప్తు మొత్తం ఈ అల్ ఫలాహ్ చుట్టూనే తిరుగుతోంది. ఇక ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన ఈ వర్సిటీ సమీపంలో తాజాగా ఓ భూగర్భ మదర్సా (Underground Madrassa) బయటపడింది.
యూనివర్సిటీకి కేవలం 900 మీటర్ల దూరంలో ఈ మదర్సాను పోలీసులు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. 4,000 నుంచి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మదర్సా సాధారణ నిర్మాణాలకు భిన్నంగా ఉంది. ఆ మదర్సా గోడలను ఏకంగా 4 నుంచి 5 అడుగుల మందంతో నిర్మించడం చర్చనీయాంశమవుతోంది. ఇది మౌలానా ఇష్తేయాక్ పేరుతో రిజిస్టర్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అతడికి ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
Also Read..
Pan Masala | ఢిల్లీలో బిజినెస్ టైకూన్ కోడలి ఆత్మహత్య.. గదిలో సూసైడ్ నోట్ లభ్యం
HP Layoffs | ఏఐ ఎఫెక్ట్.. హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్
Karnataka | సిద్ధరామయ్య Or శివకుమార్.. డిసెంబర్ 1నాటికి తేలనున్న కర్ణాటక కాంగ్రెస్ పంచాయితీ