Pan Masala | దేశ రాజధాని ఢిల్లీలో ఓ బిజినెస్ టైకూన్ కోడలు ఆత్మహత్య (Suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది. పాన్ మసాలా (Pan Masala) బ్రాండ్‌తో పాపులర్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త కమల్ కిషోర్ చౌరాసియా (Kamal Kishor Chaurasia) కోడలు దీప్తి చౌరాసియా (40) దక్షిణ ఢిల్లీలోని నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది.
దీప్తి చౌరాసియా (Deepti Chaurasia).. కమల్ కిషోర్ కుమారుడు హర్‌ప్రీత్ (Harpreet)ను 2010లో వివాహం చేసుకుంది. ఈ జంటకు 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, నిన్న మధ్యాహ్నం సమయంలో ఆమె తన నివాసంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. ఆమె గదిలో సూసైడ్ నోట్ కూడా లభించింది. అందులో తన మరణంతో ఎవరికీ సంబంధం లేదని రాసింది. అంతేకాదు, ‘రిలేషన్లో ప్రేమ, నమ్మకం లేకపోతే, ఇక జీవితానికి అర్థం ఏముంది?’ అని తన నోట్లో రాయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Karnataka | సిద్ధరామయ్య Or శివకుమార్.. డిసెంబర్ 1నాటికి తేలనున్న కర్ణాటక కాంగ్రెస్ పంచాయితీ
Smriti Mandhana | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన స్మృతి మంధాన తండ్రి.. పెళ్లి డేట్ ప్రకటిస్తారా..?
Mumbai Terror Attack | ముంబై మారణహోమానికి 17 ఏండ్లు