Passengers | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అక్కడ జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela)కు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. భక్తులతో ఆయా మార్గాల్లో నడుస్తున్న రైళ్లన్నీ రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో బీహార్ (Bihar) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధుబని రైల్వే స్టేషన్లో (Madhubani Railway station) రైలుపై ప్రయాణికులు దాడి చేశారు.
Why don’t we get good infrastructure 💀 #Bihar pic.twitter.com/L9BjJD57hc
— Sanju (@Cric_Sanju) February 11, 2025
స్వతంత్ర సేనానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Swatantrata Senani Super Fast Express) రైలు బీహార్‌లోని జైనగర్ నుంచి ప్రయాగ్‌రాజ్ మీదుగా న్యూ ఢిల్లీకి వెళ్తోంది. ఈ క్రమంలో మధుబని రైల్వే స్టేషన్లో కుంభమేళా భక్తులు రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫామ్‌పై భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయితే, అప్పటికే రైలు పూర్తిగా నిండిపోయింది. కాలుతీసి కాలుపెట్టేకి లేకుండా యాత్రికులతో కిక్కిరిపోయింది. రద్దీ కారణంగా మధుబని రైల్వే స్టేషన్లో రైలు డోర్లను అధికారులు తెరవలేదు. దీంతో ఆగ్రహించిన యాత్రికులు రైలుపై రాళ్లతో దాడి చేశారు (passengers throwing stones). ఏసీ కోచ్ కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రయాణికుల చర్యతో రైల్వే స్టేషన్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Frustrated Maha Kumbh devotees in #Bihar stranded for hours due to overcrowding, erupted in anger as Swatantrata Senani Express arrived packed beyond capacity
Desperate to board, some smashed train windows, causing glass to fall onto passengers inside. Viral videos capture… pic.twitter.com/9UEYw8z15Z
— Nabila Jamal (@nabilajamal_) February 11, 2025
Also Read..
Ayodhya Ram Temple | మహాకుంభమేళా ఎఫెక్ట్.. అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Maha Kumbh | కుంభమేళా నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం.. హైదరాబాదీలు మృతి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు