న్యూఢిల్లీ: డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. భారత్, లిషెన్స్టీన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రా తదితర దేశాల చొరవతో ఐరాస సాధారణ సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఐరాసలో భారత దేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఎక్స్ పోస్ట్‌లో ఈ వివరాలను తెలిపారు.
సమగ్ర సంక్షేమం, అంతరాత్మ పరివర్తనల కోసం డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినంగా నిర్వహించాలని ఐరాస నిర్ణయించిందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న నిర్వహిస్తున్నామని, అప్పటి నుంచి సరిగ్గా ఆరు నెలల తర్వాత ప్రపంచ ధ్యాన దినోత్సవం వస్తున్నదని వివరించారు.