కీవ్: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నది. తాజాగా ఉక్రెయిన్పై రష్యా ప్రయోగించిన క్షిపణి దాడిలో 17 మంది గాయపడగా, ప్రతిగా రష్యాపై ఉక్రెయిన్ 100కు పైగా డ్రోన్లతో విరుచుకుపడడింది. ఉక్రెయిన్లోని క్రైవిరిహ్లో శనివారం రష్యా క్షిపణి దాడిలో పలు ఇండ్లు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. ఈ రెండున్నరేండ్లలో రష్యాపై ఇంత భారీగా వైమానిక దాడులకు పాల్పడటం అరుదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కురుష్క్ సహా తమ భూభాగంలోని పలు ప్రాంతాలకు వచ్చిన 110 డ్రోన్లను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. డెజెర్కిన్స్లో మందుగుండు సామగ్రి ఫ్యాక్టరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది.