శనివారం 06 మార్చి 2021
National - Jan 26, 2021 , 11:44:59

భార‌త్‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని శుభాకాంక్ష‌లు

భార‌త్‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని శుభాకాంక్ష‌లు

న్యూఢిల్లీ: బిట్ర‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ భార‌త్‌కు 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇది ప్ర‌పంచంలోనే అసాధార‌ణ రాజ్యాంగానికి జ‌న్మ‌దిన‌మ‌ని ఆయ‌న కొనియాడారు. ఈ మేర‌కు బోరిస్ జాన్స‌న్ భార‌త్‌కు ఒక సందేశాన్ని పంపించారు. భార‌త్ ఈ రోజు రిప‌బ్లిక్ డే వేడుక‌లు జ‌రుపుకుంటున్న‌ది. ఇది అసాధార‌ణ‌మైన రాజ్యాంగానికి పుట్టిన‌రోజు. ఆ అసాధార‌ణ రాజ్యాంగ‌మే భార‌త్‌ను ప్ర‌పంచంలోనే అత్యంత శ్రేష్ఠ‌మైన ప్ర‌జాస్వామ్య దేశంగా నిల‌బెట్టింది. భార‌త్ అంటే నాకు గుండెల నిండా అభిమానం ఉన్న‌ది. ఆ దేశానికి, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అని బోరిస్ జాన్స‌న్ త‌న సందేశంలో పేర్కొన్నారు.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo