Strait of Hormuz | హార్ముజ్ జలసంధి పునరుద్ధరణపై చర్చలకు.. భారత్కు యూకే ఆహ్వానం
Strait of Hormuz | పశ్చిమాసియాలో సంఘర్షణ వల్ల ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడంపై చర్చించేందుకు సుమారు 40 దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా భారత్కు కూడా ఆహ్వానం అందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంఘర్షణ వల్ల ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడంపై చర్చించేందుకు సుమారు 40 దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. (Strait of Hormuz) ఇందులో భాగంగా భారత్కు కూడా ఆహ్వానం అందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. బ్రిటన్లో ఇవాళ జరుగనున్న ఈ సమావేశంలో భారత్ తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ‘హోర్ముజ్ జలసంధిపై చర్చల కోసం భారతదేశంతో సహా పలు దేశాలను యూకే ఆహ్వానించింది. ఈ సాయంత్రం జరిగే సమావేశానికి భారత్ తరపున విదేశాంగ కార్యదర్శి హాజరవుతున్నారు’ అని అన్నారు.
కాగా, మన దేశ నౌకలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, సురక్షితమైన రాకపోకలు కల్పించడానికి ఏ మార్గం అత్యుత్తమమో తెలుసుకునేందుకు ఇరాన్, ఆ ప్రాంతంలోని ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ సంప్రదింపులు ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ‘గత కొద్ది రోజులుగా మేము జరిపిన చర్చల ఫలితంగా ఆరు భారతీయ నౌకలు ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను సురక్షితంగా దాటగలిగాయి. సంబంధిత వర్గాలతో మా సంప్రదింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి’ అని మీడియాతో ఆయన అన్నారు.
Also Read:
Guests Assault Bride, Groom | మద్యం ఇవ్వలేదని.. వధూవరులపై పెళ్లి అతిథుల దాడి
Watch: ఒక ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. మహిళలు ఏం చేశారంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

